కర్నూలు, చిత్తూరు, విశాఖ, ప్రకాశం జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరిక!
- జారీచేసిన ఏపీ విపత్తు నిర్వహణ శాఖ
- ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వ్యాఖ్య
- విద్యుత్ స్తంభాలు, భారీ చెట్లకు దూరంగా ఉండాలని సూచన
ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు, అర్ధవీడు, మార్కాపురంలోనూ ఆకాశం మేఘావృతమై పిడుగులు పడొచ్చని హెచ్చరించింది. విశాఖపట్నం జిల్లాలోని అనంతగిరి, జీకే వీధి, జి.మాడుగుల, అరకు ప్రాంతాలకు కూడా ఏపీ విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరికలు జారీచేసింది. ఈ ప్రాంతాల్లోని ప్రజలు జాగ్రత్తగా ఉండాలనీ, భారీ చెట్లు, పెద్దపెద్ద విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని సూచించింది. బలమైన ఈదురుగాలులతో పాటు మెరుపులు మెరుస్తుంటే విద్యుత్ పరికరాలకు దూరంగా ఉండాలని సూచించింది.