Andhra Pradesh: జాతీయ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషించడం చంద్రబాబుకు కొత్త కాదు!: కంభంపాటి రామ్మోహన్‌రావు

  • చంద్రగిరి వ్యవహారంలో మేం గతంలోనే ఫిర్యాదు చేశాం
  • కానీ ఈసీ పట్టించుకోలేదు
  • ఈరోజు సాయంత్రం 4.30 గంటలకు ఈసీతో బాబు భేటీ

చంద్రగిరిలో రీపోలింగ్ వ్యవహారంపై తాము ఫిర్యాదు చేసినప్పటికీ కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటివరకూ స్పందించలేదని టీడీపీ నేత కంభంపాటి రామ్మోహన్‌రావు తెలిపారు. ఈసీ ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఈ నేపథ్యంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈరోజు ఢిల్లీకి వచ్చారని చెప్పారు.

ఏపీతో పాటు పశ్చిమబెంగాల్ లో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై ఈసీతో చంద్రబాబు చర్చిస్తారని పేర్కొన్నారు. ఈరోజు సాయంత్రం 4.30 గంటలకు చంద్రబాబు ఈసీతో భేటీ అవుతారని చెప్పారు. ఢిల్లీలో ఈరోజు కంభంపాటి రామ్మోహన్‌రావు మీడియాతో మాట్లాడారు.

ఎన్డీయేతర పార్టీలను కలుపుకుని అందరినీ ఏకతాటిపైకి తెచ్చేందుకు చంద్రబాబు కృషి చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఈ పర్యటనలో భాగంగా రాహుల్‌గాంధీ, సోనియాగాంధీ, సీతారాం ఏచూరి, సురవరం సుధాకర్‌రెడ్డి, శరద్‌ పవార్‌, అఖిలేష్‌ యాదవ్‌, మాయావతి సహా పలువురు ప్రముఖులను కలుస్తారని చెప్పారు. జాతీయ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషించడం చంద్రబాబుకు కొత్త కాదని, ఏపీలో టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని జోస్యం చెప్పారు.

  • Loading...

More Telugu News