Mahesh Babu: 'టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ ఫరెవర్' జాబితాలో మహేశ్ బాబు... దక్షిణాదిలో ఎవరికీ దక్కని గౌరవం!

  • మహేశ్ ఖాతాలో మరో ఘనత
  • సల్మాన్, అమీర్, షారుఖ్, అక్షయ్ సరసన మహేశ్
  • మరింత విస్తరించిన మహేశ్ పాప్యులారిటీ

గతకొంతకాలంగా విలక్షణమైన చిత్రాలతో ప్రేక్షకుల్లో తన స్థానాన్ని మరింతగా పెంచుకుంటూ పోతున్న టాలీవుడ్ అగ్రహీరో మహేశ్ బాబుకు అరుదైన గుర్తింపు లభించింది. ప్రఖ్యాత 'టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ ఫరెవర్-2018' జాబితాలో మహేశ్ బాబుకు స్థానం కల్పించారు. ఇప్పటివరకు ఏ దక్షిణాది హీరోకి ఈ గౌరవం లభించలేదు. గతంలో ఉత్తరాది నుంచి ఖాన్ త్రయం సల్మాన్, షారుఖ్, అమీర్ తో పాటు అక్షయ్ కుమార్ మాత్రమే ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. ఇప్పుడు మహేశ్ బాబు కూడా వారి సరసన చేరారు. మహర్షి చిత్ర విజయంతో మాంచి ఊపుమీదున్న ఈ టాలీవుడ్ ప్రిన్స్ కు ఇది మరో ఘనత అని చెప్పాలి. మహేశ్ ప్రజాదరణ మరింత విస్తరించిందనడానికి టైమ్స్ గుర్తింపే నిదర్శనం.

More Telugu News