chandragiri: చంద్రగిరి రీపోలింగ్‌ వెనుక బీజేపీ, వైసీపీ కుట్ర ఉంది: మంత్రి దేవినేని ఉమ

  • లేదంటే ఎన్నికలు జరిగిన 34 రోజుల తర్వాత  పోలింగ్ కు ఆదేశాలేమిటి?
  • ఆరోజు పోలింగ్‌ సమయంలో పనిచేయని కొన్ని ఈవీఎంలు
  • కొన్ని బాగు చేయడానికి ఆరు గంటల సమయం తీసుకున్నారు
చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో రీ పోలింగ్‌కు ఎన్నికల సంఘం ఆదేశించడం వెనుక బీజేపీ, వైసీపీ కుట్ర ఉందని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ధ్వజమెత్తారు. ఈరోజు ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఎన్నికలు జరిగిన 34 రోజుల తర్వాత ఆదేశాలు ఇవ్వడంలోనే కుట్ర తేటతెల్లమవుతోందని అన్నారు. ఎన్నికల రోజే నియోజకవర్గంలో చాలా ఈవీఎంలు పని చేయలేదని, వాటి మరమ్మతు కోసం ఆరు గంటల సమయం తీసుకున్నారని చెప్పారు. ఒక ఈవీఎం బాగు చేయడానికి అన్ని గంటలు అవసరమా? అని ప్రశ్నించారు. ఇదంతా కుట్రలో భాగంగానే భావించాలని తేల్చిచెప్పారు.
chandragiri
repoling
devineni uma
YSRCP
BJP

More Telugu News