azam khan: గాంధీనా లేక గాడ్సేనా.. ప్రజలే నిర్ణయిస్తారు: ఆజం ఖాన్

  • ఖాకీ నిక్కరుతోనే గాడ్సేకు గుర్తింపు వచ్చింది
  • సాధ్వి వ్యాఖ్యలను ఖండిస్తున్నానన్న ఆజం ఖాన్
  • గాడ్సే గొప్ప దేశభక్తుడు అన్న సాధ్వి వ్యాఖ్యలపై ఆజం ఖాన్ స్పందన
మహాత్మాగాంధీని చంపిన గాడ్సే గొప్ప దేశ భక్తుడంటూ బీజేపీ నాయకురాలు సాధ్వి ప్రజ్ఞా ఠాకూర్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలు చివరకు బీజేపీని కూడా ఇరుకున పెట్టాయి. ఈ నేపథ్యంలో పార్టీ హైకమాండ్ ఆదేశాల మేరకు సాధ్వి క్షమాపణలు కూడా చెప్పారు. అయినప్పటికీ ఈ వివాదం ఇంకా చల్లారలేరు. సమాజ్ వాదీ పార్టీ వివాదాస్పద నేత ఆజం ఖాన్ ఈ అంశంపై విమర్శలు గుప్పించారు. ఆరెస్సెస్ ఖాకీ నిక్కరుతోనే గాడ్సేకు గుర్తింపు లభించిందని చెప్పారు. గాంధీ కావాలో, గాడ్సే కావాలో ప్రజలే నిర్ణయిస్తారని అన్నారు. గాడ్సే గురించి సాధ్వి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పారు.
azam khan
godsey
sadhvi pragya
bjp
sp

More Telugu News