చంద్రగిరి నుంచి షిర్డీకి చెవిరెడ్డి ప్రత్యేక రైలు.. మద్యం తాగుతూ, పేకాడుతూ అనుచరుల హల్‌చల్
- నియోజకవర్గంలోని ఐదు పోలింగ్ బూత్‌లలో ఆదివారం రీపోలింగ్
- వైసీపీ కార్యకర్తలు, నాయకులను షిర్డీ పంపిన చెవిరెడ్డి
- ప్లాట్‌ఫాంపైనే తాగుతూ చిందేసిన అనుచరులు
గురువారం ఉదయం పదిన్నర గంటలకు రైలు షిర్డీకి బయలుదేరింది. రేణిగుంట రైల్వే స్టేషన్‌లో రైలు అరగంటపాటు ఆగడంతో వైసీపీ నేతలు, కార్యకర్తలు పరుగుపరుగున బయటకు వెళ్లి పెద్ద ఎత్తున మద్యం కొనుగోలు చేసి తెచ్చుకున్నారు. మద్యం చేతికి అందిన వెంటనే కొందరు తమ సీట్లలో కూర్చుని పని కానిచ్చేయగా, కొందరు దర్జాగా ప్లాట్‌ఫాం పైనే మద్యం తాగారు. వీరి చేష్టలను చూస్తున్న రైల్వే పోలీసులు వారిని వారించకపోవడంతో ఇతర ప్రయాణికులు ముక్కున వేలేసుకున్నారు.
నేడు షిర్డీలో వీరికి దర్శనం పూర్తయిన అనంతరం శనివారం తిరిగి చంద్రగిరికి తీసుకురానున్నారు. ఆదివారం పులివర్తిపల్లి, వెంకట్రామాపురం, కొత్తకండ్రిగ, కమ్మపల్లి, ఎన్‌ఆర్ కమ్మపల్లి గ్రామాల్లోని పోలింగ్ బూత్‌లలో రీపోలింగ్ జరగనుంది. చెవిరెడ్డి రైలులో యాత్రకు వెళ్లిన వారిలో ఈ గ్రామాల ప్రజలు, నాయకులు ఉన్నారు.