Pragya Singh: గాడ్సే వ్యాఖ్యలపై తన ప్రతినిధితో క్షమాపణల ప్రకటన చేయించిన సాధ్వీ ప్రజ్ఞా సింగ్

  • ఎట్టకేలకు వెనక్కి తగ్గిన సాధ్వీ
  • సొంత పార్టీలోనే వ్యతిరేకత!
  • కొద్దిగంటల్లోనే క్షమాపణ
వివాదాస్పద నేత, భోపాల్ లోక్ సభ స్థానం బీజేపీ అభ్యర్థి సాధ్వీ ప్రజ్ఞా సింగ్ తన వ్యాఖ్యలపై క్షమాపణలు తెలియజేశారు. మహాత్మాగాంధీని చంపిన గాడ్సే నిజమైన దేశభక్తుడు అంటూ ఇవాళ ఉదయం ఆమె చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా కలకలం రేపాయి. జీవీఎల్ వంటి బీజేపీ నేతలు సైతం ప్రజ్ఞా సింగ్ వ్యాఖ్యలను తప్పుబట్టారు. దాంతో, ఆమె తన వ్యాఖ్యల పట్ల చింతిస్తున్నట్టు తన ప్రతినిధి హితేశ్ వాజ్ పేయితో ఓ ప్రకటన చేయించారు. గాడ్సేపై చేసిన వ్యాఖ్యలకు సాధ్వీ క్షమాపణ తెలియజేశారని హితేశ్ వాజ్ పేయి వెల్లడించారు. ఆమె క్షమాపణ చెప్పినా విమర్శలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. కాంగ్రెస్ సీనియర్ నేత, భోపాల్ కాంగ్రెస్ అభ్యర్థి దిగ్విజయ్ సింగ్ కూడా సాధ్వీ వ్యాఖ్యలపై మండిపడ్డారు.
Pragya Singh
BJP

More Telugu News