Telangana: ‘మల్లన్నసాగర్’పై హైకోర్టు తీర్పు ప్రతిపక్షానికి చెంపపెట్టు: తెలంగాణ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

  • ప్రతిపక్షం ఇప్పటికైనా బుద్ధితెచ్చుకోవాలి
  • నిర్వాసితులను రెచ్చగొట్టడం ఇకనైనా మానుకోవాలి
  • నిర్వాసితులకు అన్ని విధాల న్యాయం చేస్తాం
‘కాళేశ్వరం’, దాని అనుబంధ ప్రాజెక్టుల పనులకు ఎటువంటి ఆటంకం కల్గించవద్దని హైకోర్టు ఆదేశించడం ప్రతిపక్షానికి చెంపపెట్టు లాంటిదని తెలంగాణ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వ్యాఖ్యానించారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టుపై హైకోర్టు తీర్పు పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ప్రాజెక్టు పనులకు ఆటంకం కల్గిస్తున్న ప్రతిపక్షం ఇప్పటికైనా బుద్ధితెచ్చుకోవాలని అన్నారు. రాజకీయాల కోసం నిర్వాసితులను రెచ్చగొట్టడం ఇకనైనా మానుకోవాలని ప్రతిపక్షాలకు హితవు పలికారు. తెలంగాణ రాష్ట్రానికి జీవధార కాళేశ్వరం ప్రాజెక్టు అని, అటువంటి ప్రాజెక్టు నిర్మాణ పనులను అడ్డుకోవాలని చూడటం కరెక్టు కాదని అన్నారు. నిర్వాసితులకు అన్ని విధాల న్యాయం చేస్తామని ఇంద్రకరణ్ రెడ్డి చెప్పారు.
Telangana
Kaleswaram
Mallanna sagar
indra karan

More Telugu News