రజనీకాంత్ ఇంత పెద్ద స్టార్ అవుతాడని నేను అనుకోలేదు: దేవదాస్ కనకాల

  • రజనీకాంత్ ను చూస్తే పాపం అనిపించేది
  •  ఆయన వ్యక్తిత్వం చాలా గొప్పది
  •  సాయం చేయడానికి ఎంతమాత్రం ఆలోచించడు
దేవదాస్ కనకాల దగ్గర నటన నేర్చుకున్న ఎంతోమంది ఆ తరువాత కాలంలో స్టార్స్ గా వెండితెరను ఏలేశారు. అలా ఆయన దగ్గర నటనను నేర్చుకున్నవారిలో రజనీకాంత్ ఒకరు. తాజా ఇంటర్వ్యూలో దేవదాస్ కనకాల మాట్లాడుతూ, రజనీ గురించి ప్రస్తావించారు.

"రజనీకాంత్ చాలా సాధారణమైన కుటుంబం నుంచి వచ్చాడు. ఆయన పరిస్థితిని చూసినప్పుడు నాకు 'పాపం' అనిపించేది. రజనీకాంత్ ను చూసినప్పుడు .. ఆయన స్టైల్ ను గమనించినప్పుడు ఆర్టిఫీషియల్ యాక్టింగ్ చేస్తాడేమో అనుకున్నాను. కానీ ఆయన ఒక వైపున తనదైన స్టైల్ ను చూపిస్తూనే, అద్భుతమైన నటనను కనబరుస్తూ వెళ్లాడు. రజనీకాంత్ ఇంత గొప్ప స్టార్ అవుతాడని అప్పట్లో నేను ఎంతమాత్రం అనుకోలేదు. రజనీకాంత్ ఇంత గొప్పవాడు కావడానికి ఆయన స్టైల్ .. నటన మాత్రమే కాదు, ఆయన వ్యక్తిత్వం కూడా ఒక కారణం అని చెప్పుకోవాలి. ఆయన వ్యక్తిత్వం చాలా గొప్పది .. తనకి సాయం చేసినవారిని ఆయన మరిచిపోలేదు. తను సాయం చేయవలసి వస్తే ఆలోచించలేదు" అని చెప్పుకొచ్చారు. 
Go Back to Shorts
rajani
devadas kanakala

More Telugu News