పారిశుద్ధ్య కార్మికులను ఢీకొట్టిన కారు.. ఇద్దరు మహిళల దుర్మరణం

  • మరో మహిళకు తీవ్రగాయాలు
  • కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు ఫ్లైఓవర్‌ వద్ద ఘటన
  • మృతులు గుండ్రాయి గ్రామానికి చెందిన వారిగా గుర్తింపు
విధుల్లో భాగంగా రోడ్డును శుభ్రం చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులను అతివేగంగా వచ్చిన కారు ఢీకొట్టిన ప్రమాదంలో ఇద్దరు మహిళా కార్మికులు అక్కడికక్కడే దుర్మరణం చెందగా, మరో మహిళ తీవ్రంగా గాయపడింది. క్షతగాత్రురాలిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.

పోలీసులు కథనం మేరకు... కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం గండ్రాయి గ్రామానికి చెందిన మంగతాయారు (60), ఉషారాణి (35), ఉమతోపాటు మరికొందరు కార్మికులు ఈరోజు ఉదయం చిల్లకల్లు ఫ్లైఓవర్‌ వద్ద రోడ్డును శుభ్రం చేస్తున్నారు. ఆ సమయంలో విజయవాడ నుంచి హైదరాబాద్‌ వైపు వెళ్తున్న కారు వంతెన వద్ద పని చేస్తున్న వీరిని ఢీకొట్టింది.

ఈ ఘటనలో మంగతాయారు, ఉషారాణి అక్కడికక్కడే చనిపోగా, ఉమ తీవ్రంగా గాయపడింది. ఆమెను 108 అంబులెన్స్‌లో హుటాహుటిన జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. 
Go Back to Shorts
Road Accident
Krishna District
jaggayyapeta
two died

More Telugu News