West Bengal: పశ్చిమబెంగాల్‌లో పోటాపోటీ ప్రచారం: మోదీ ర్యాలీలు రెండు...మమత ర్యాలీలు నాలుగు!

  • ఈరోజు ప్రచారం ముగుస్తుండడంతో హోరాహోరీ
  • ఆధిపత్యం కోసం బీజేపీ, తృణమూల్‌ ప్రయత్నం
  • నేటి రాత్రి పది గంటలతో ప్రచార హోరుకు తెర

పశ్చిమబెంగాల్‌ రాష్ట్రంలో హోరాహోరీగా తలపడుతున్న అధికార తృణమూల్‌, బీజేపీలు ఎన్నిక ప్రచారానికి చివరి రోజు అదే స్థాయిలో పోటీపడుతున్నాయి. ప్రచారంలో భాగంగా బెంగాల్‌లో హింస చెలరేగడం, రాజకీయ పార్టీల పరస్పర ఫిర్యాదుల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఇక్కడ ప్రచారాన్ని ఒక రోజు ముందుగానే ముగించాలని ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో ఈరోజు రాత్రి 10 గంటల తర్వాత ఇక్కడి మైకులు మూగబోనున్నాయి. దీంతో సమయం లేకపోవడంతో తృణమూల్‌, బీజేపీలు పోటాపోటీ ర్యాలీలకు సిద్ధమయ్యాయి.

 ప్రధాని మోదీ మధురాపూర్‌, డమ్‌డమ్‌లలో ఎన్నిక ప్రచారం సాగించాలని నిర్ణయించగా, మమతా బెనర్జీ ఏకంగా నాలుగు చోట్ల రోడ్‌ షోలు నిర్వహణకు నిర్ణయించారు. నార్త్‌ 24 పరగణాలు, డైమండ్‌ హార్బర్‌, సౌత్‌వెస్ట్‌ పరగణాలు, కోల్‌కతాలో రోడ్‌షోలు నిర్వహించతలపెట్టారు. మధ్యాహ్నం ఒంటి గంటకు నార్త్‌ 24 పరగణాలలో ర్యాలీ పూర్తి చేసుకుని డైమండ్‌ హార్బర్‌ చేరుకుంటారు. ఆ తర్వాత వరుస రోడ్డు షోల్లో పాల్గొంటారు. మోదీ మధ్యాహ్నం 4.30 గంటలకు మధురాపూర్‌లోను, సాయంత్రం 6.10 గంటకు డమ్‌డమ్‌లోనూ జరిగే ర్యాలీల్లో పాల్గొంటారు.

  • Loading...

More Telugu News