Nallamala: నల్లమల అడవుల్లో గుప్తనిధుల కోసం వెళ్లి ఇద్దరి అదృశ్యం!

  • అడవుల్లోకి వెళ్లిన ముగ్గురు వ్యక్తులు
  • ఇద్దరు అదృశ్యం, వెనక్కు ఒకరు
  • గాలింపు చేపట్టిన పోలీసులు
నల్లమల అటవీ ప్రాంతంలో పురాతన కాలంలో దాచిన గుప్తనిధులను వెతికేందుకు వెళ్లిన వారిలో ఇద్దరు అదృశ్యమయ్యారు. ప్రకాశం జిల్లా తర్లుపాడు మండల పరిధిలోని నల్లమల అడవుల్లో గుప్తనిధులు ఉన్నాయన్న ప్రచారాన్ని నమ్మిన ముగ్గురు యువకులు మూడు రోజుల క్రితం అడవుల్లోకి వెళ్లారు.

వీరు అడవిలో ఒకరోజు ఉన్న తరువాత, మరింత లోపలికి వెళ్లే ప్రయత్నంలో ఇద్దరు అదృశ్యం కాగా, మరొకరు వెనక్కు వచ్చాడు. అతను ఇచ్చిన సమాచారంతో పోలీసు బృందాలు అడవిలో గాలింపుకు వెళ్లాయి. ఈ ప్రాంతంలోని అడవులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్టాల మధ్య విస్తరించి వుండగా, మధ్యలో కృష్ణానది పారుతూ ఉంటుంది. శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ సైతం ఈ పరిధిలోనే ఉంటుంది.
Nallamala
Treasure
Hunt

More Telugu News