Kuldeep Yadav: కారణం లేకుండానే మీడియా నన్ను వివాదంలోకి లాగింది!: కుల్దీప్ యాదవ్

  • మీడియాలో వచ్చిన వార్తల్లో నిజం లేదు
  • ఎవరి మీదా అనవసర వ్యాఖ్యలు చెయ్యలేదు
  • ఆట మధ్యలో ధోనీ మాట్లాడడు
ఎటువంటి కారణం లేకుండానే మీడియా తనను వివాదంలోకి లాగిందని, ధోనీకి వ్యతిరేకంగా తాను మాట్లాడినట్టు వచ్చిన వార్తల్లో నిజం లేదని టీమిండియా స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ తెలిపాడు. ధోనీ సలహాలు చాలా సార్లు పని చేయలేదంటూ కుల్దీప్ కామెంట్ చేశాడంటూ మీడియాలో వార్తలు వచ్చాయి. దీనిపై సోషల్ మీడియా ద్వారా స్పందించాడు. తాను ఎవరిమీదా అనవసరపు వ్యాఖ్యలు చేయలేదని మహి భాయ్ అంటే తనకు ఎంతో గౌరవముందని తెలిపాడు. ఆట మధ్యలో ధోనీ మాట్లాడడని, అవసరం అనుకుంటేనే ఓవర్స్ గ్యాప్‌లో మాట్లాడతాడని కుల్దీప్ పేర్కొన్నారు.
Kuldeep Yadav
Dhoni
Media
Social Media
Overs Gap

More Telugu News