rishabh panth: పంత్ ను కాకుండా దినేశ్ కార్తీక్ ను తీసుకోవడానికి కారణం ఇదే: కోహ్లీ

  • దినేశ్ కార్తీక్ కు ఎక్కువ అనుభవం ఉంది
  • క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఆడగలడు
  • మ్యాచ్ ఫినిషర్ గా మంచి ట్రాక్ రికార్డ్ ఉంది

ఈ ఏడాది జరుగుతున్న ప్రపంచ కప్ లో ఆడే జట్టును బీసీసీఐ గత నెలలో ప్రకటించింది. అయితే, సెకండ్ వికెట్ కీపర్ గా రిషభ్ పంత్ ను కాదని దినేశ్ కార్తీక్ ను సెలెక్ట్ చేయడంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. దినేశ్ కార్తీక్ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని అతన్ని ఎంపిక చేశామని ఇప్పటికే చీఫ్ సెలెక్టర్ ఎంఎస్కే ప్రసాద్ స్పష్టం చేశాడు. తాజాగా ఇదే అంశంపై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పందించాడు.

దినేశ్ కార్తీక్ కు చాలా అనుభవం ఉందని, క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఒత్తిడిని తట్టుకుని ఆడే సత్తా ఉందని... ఈ నేపథ్యంలోనే పంత్ ను కాదని అతన్ని సెలెక్ట్ చేశామని కోహ్లీ తెలిపాడు. వికెట్ కీపర్ గా ధోనీ వ్యవహరిస్తాడని... అనివార్య కారణాల వల్ల ధోనీ ఏదైనా మ్యాచ్ లో ఆడలేకపోతే దినేశ్ కార్తీక్ జట్టులోకి వస్తాడని చెప్పాడు. మ్యాచ్ ఫినిష్ చేయడంలో కార్తీక్ కి మంచి ట్రాక్ రికార్డ్ ఉందని తెలిపాడు.

More Telugu News