Telangana: మేము కేసీఆర్ కు భయపడుతున్నామా?: ప్రముఖ రచయిత కోన వెంకట్

  • సినిమా వాళ్లకు కేసీఆర్ బెదిరింపు ఆరోపణలపై స్పందన
  • భయపెట్టడం నిజమే అయితే భయపడటమూ నిజమే!
  • చంద్రబాబుకు వ్యతిరేకంగా మాట్లాడటం వల్ల వైసీపీకి ఓట్లు పడతాయా?
సినిమా వాళ్లను కేసీఆర్ బెదిరిస్తున్నారు కనుకే వైఎస్ జగన్ కు వాళ్లు మద్దతు తెలుపుతున్నారని సీఎం చంద్రబాబు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఇదే విషయమై ఓ ఇంటర్వ్యూలో ప్రముఖ రచయిత కోన వెంకట్ ను ప్రశ్నించగా ఆయన బదులిస్తూ, ‘కేసీఆర్ కు భయపడుతున్నామా? ఒకవేళ వాళ్లు భయపెడుతున్నారన్నది నిజమే అయితే కనుక, మేము భయపడుతున్నామన్నది కూడా నిజమే. అసలు కేసీఆర్ కు, ఆంధ్రా రాజకీయాలకు సంబంధం ఏమిటి?’ అని కోన ప్రశ్నించారు.

కేసీఆర్ లేదా కేటీఆర్ బెదిరింపులతో తానో, మరొకరో చంద్రబాబుకు వ్యతిరేకంగా మాట్లాడటం వల్ల టీడీపీకి పడాల్సిన ఓట్లన్నీ వైసీపీకి పడతాయా? ప్రజలను తాము ఏ రకంగా ప్రభావితం చేయగల్గుతామని అన్నారు. ప్రజలను అంతగా తాను ప్రభావితం చేయగలనని అనుకోవట్లేదని కోన వెంకట్ వ్యాఖ్యానించారు.
Telangana
cm
kcr
writer
kona venkat

More Telugu News