Mahesh Babu: వెంకయ్యనాయుడు ట్వీట్ పై స్పందించిన మహేశ్ బాబు

  • మహర్షి సినిమా రైతులకు మద్దతుగా ఉందన్న వెంకయ్య
  • ప్రతి ఒక్కరూ చూడాలంటూ సూచన
  • థ్యాంక్స్ చెప్పిన మహేశ్ బాబు
ఇటీవలే విడుదలైన మహర్షి చిత్రాన్ని భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కుటుంబంతో కలిసి వీక్షించడమే కాకుండా తన అభిప్రాయాన్ని ట్విట్టర్ లో పోస్టు చేశారు. అన్నదాతలకు అండగా నిలవాల్సిన అవసరాన్ని మహర్షి చిత్రం చాటిచెబుతోందని, ఈ సినిమాను ప్రతి ఒక్కరూ చూడాలని వెంకయ్య పేర్కొన్నారు. దీనిపై మహర్షి చిత్ర కథానాయకుడు మహేశ్ బాబు స్పందించారు.

"సర్, మీ అభినందన వ్యక్తిగతంగా నాకు, మా టీమ్ మొత్తానికి లభించిన గౌరవంగా భావిస్తున్నాను. ఇంతకుమించిన ప్రశంస మరొకటి ఉండదనుకుంటున్నాను. థాంక్యూ సర్! మహర్షి లాంటి మరెన్నో మంచి చిత్రాలు చేయడానికి మీ మాటలు స్ఫూర్తి కలిగిస్తున్నాయి. మా మహర్షి టీమ్ తరఫున చెబుతున్నాను.... మీ మాటలకు ఫిదా అయ్యాం సర్!" అంటూ మహేశ్ బాబు ట్వీట్ చేశారు.
Mahesh Babu
Venkaiah Naidu
Maharshi

More Telugu News