TRTRC: డ్రైవింగ్ చేస్తూ గుట్కా వేసుకున్న డ్రైవర్.. అదుపు తప్పిన బస్సు .. పలువురికి గాయాలు!

  • టీఎస్ ఆర్టీసీ బస్సుకు ప్రమాదం
  • కాళేశ్వరం నుండి గోదావరిఖనికి వెళుతుండగా ఘటన
  • ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 60 మంది ప్రయాణికులు

ఓ పక్క డ్రైవింగ్ చేస్తూ, మరోపక్క డ్రైవర్ గుట్కా వేసుకుంటుండడంతో బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనికి చెందిన టీఎస్ ఆర్టీసీ బస్సు గోదావరిఖని నుండి భూపాలపల్లికి వెళుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. బస్సు డ్రైవర్ గుట్కా ప్యాకెట్ చింపి నోట్లో వేసుకుంటున్న సమయంలో మల్హర్ మండల పరిధిలోని టీవీనగర్ సమీపంలోని మానేరు బ్రిడ్జి దాటుతుండగా బస్సు అదుపు తప్పింది. పక్కనే ఉన్న తొమ్మిది మీటర్ల లోతు గోతిలోకి బస్సు పడిపోయింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 60 మంది ప్రయాణికులు ఉన్నట్టు సమాచారం. చికిత్స నిమిత్తం క్షతగాత్రులను మహదేవ్ పూర్, మంథని ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించారు.

  • Loading...

More Telugu News