Krishna District: టెన్త్ పాస్ అయ్యానన్న ఆనందంలో కూల్ డ్రింక్ కోసం రోడ్డుపైకి వస్తే..!

  • పశ్చిమ గోదావరి జిల్లా కలవచర్లలో విషాదం
  • అక్కా చెల్లెళ్లను ఢీకొన్న టాటా ఏస్
  • అక్క మృతి, చెల్లికి గాయాలు
పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణురాలినయ్యానన్న ఆనందంలో ఓ బాలిక కూల్ డ్రింక్ కొనుగోలు చేసేందుకు రోడ్డుపైకి రాగా, వాహనం ఢీకొని ప్రాణాలు వదిలింది. ఈ ఘోర దుర్ఘటన పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు సమీపంలోని కలవచర్ల గ్రామంలో జరిగింది. టెన్త్ రిజల్ట్స్ రాగానే, ఆనందంతో తన చెల్లెలితో కలిసి తిరుగుపల్లి రుక్మిణి (15) బయటకు వెళ్లగా, వేగంగా వచ్చిన టాటా ఏస్ - మ్యాజిక్ ఢీకొంది. ఈ ఘటనలో రుక్మిణి అక్కడికక్కడే ప్రాణాలు వదలగా, ఆమె చెల్లికి గాయాలు అయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనా స్థలిని పరిశీలించారు. రుక్మిణి సోదరిని చికిత్స నిమిత్తం నిడదవోలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.  
Krishna District
Road Accident
Tenth Results

More Telugu News