Indigo: రూ. 999కే విమానం టికెట్ ను ఆఫర్ చేస్తున్న ఇండిగో... నేడు, రేపు మాత్రమే!

  • 16వ తేదీ వరకూ అందుబాటులో ఆఫర్
  • సెప్టెంబర్ 28లోపు ప్రయాణం
  • దేశీయంగా 53, అంతర్జాతీయంగా 17 రూట్లకూ వర్తింపు

ఈ వేసవిలో రూ. 999కే విమానం టికెట్ లను అందించాలని నిర్ణయించామని దేశవాళీ విమానయాన సంస్థ ఇండిగో ప్రకటించింది. ఈ ఆఫర్ 16వ తేదీ వరకూ మాత్రమే అందుబాటులో ఉంటుందని, ఈ నెల 29 నుంచి సెప్టెంబర్ 28లోపు ఎప్పుడైనా ప్రయాణం చేయవచ్చని సంస్థ తెలిపింది. ఇండియాలోని 53 రూట్లతో పాటు 17 అంతర్జాతీయ రూట్లకూ ఆఫర్ ఉంటుందని సంస్థ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ వెల్లడించారు. ఈ సెలవుల్లో అధిక లగేజీతో వెళ్లేవారికి అదనపు చార్జీలపై 30 శాతం రాయితీని అందించనున్నామని తెలిపారు.

More Telugu News