Chandrababu: సీరియస్‌గా జరుగుతున్న మంత్రివర్గ సమావేశంలో నవ్వుల పువ్వులు పూయించిన మంత్రి ఆదినారాయణరెడ్డి

  • తుపానుల గురించి ఆర్టీజీఎస్ ముందే చెప్పిందన్న మంత్రి
  • ఓట్ల సునామీ గురించి ముందే చెప్పదా? అని ప్రశ్న
  • మీ చెవిలో చెబుతారులే అన్న చంద్రబాబు
అమరావతిలో జరిగిన మంత్రివర్గ సమావేశం ఒక్కసారిగా నవ్వులతో ఆహ్లాదంగా మారిపోయింది. మంత్రి ఆదినారాయణరెడ్డి తన సరదా వ్యాఖ్యలతో సీరియస్‌గా జరుగుతున్న సమావేశంలో నవ్వుల పువ్వులు పూయించారు. సమావేశం మధ్యలో ఆదినారాయణరెడ్డి ఆర్టీజీఎస్ గురించి మాట్లాడుతూ, తిత్లీతో పాటు ఫణి తుపాను గురించి ముందే చెప్పి అందరినీ అలెర్ట్ చేసిన ఆర్టీజీఎస్, ‘ఎన్నికల్లో ఓట్ల సునామీ గురించి ముందే చెప్పదా?’ అంటూ చంద్రబాబును ఉద్దేశించి వ్యాఖ్యానించడంతో సమావేశమంతా నవ్వులతో నిండిపోయింది. వెంటనే చంద్రబాబు కూడా అంతే సరదాగా ‘ఓట్ల సునామీ గురించి మీ చెవిలో చెబుతారులే’ అంటూ సమాధానమివ్వడంతో సమావేశమంతా ఆహ్లాదంగా మారిపోయింది.
Chandrababu
Adi Narayana Reddy
Titali
Phani
RTGS

More Telugu News