BSE: లాభాలతో ముగిసిన ఈరోజు స్టాక్ మార్కెట్లు

  • తొమ్మిది రోజుల వరుస నష్టాలకు తెర
  • కోలుకున్న సెన్సెక్స్, నిఫ్టీలు 
  • సెన్సెక్స్ కు 37,366, నిఫ్టీకు 11,240 పాయింట్ల లాభం

స్టాక్ మార్కెట్లో తొమ్మిది రోజుల వరుస నష్టాలకు తెరపడింది. సెన్సెక్స్, నిఫ్టీలు కోలుకోవడంతో ఈరోజు స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 275 పాయింట్ల లాభంతో 37,366 వద్ద, నిఫ్టీ 92 పాయింట్లు లాభపడి 11,240 పాయింట్ల వద్ద ముగిశాయి. సన్ ఫార్మా, వేదాంత, ఐసీఐసీఐ బ్యాంక్, భారతీ ఎయిర్ టెల్, ఐటీసీ సంస్థల షేర్లు అత్యధికంగా లాభపడగా, టెక్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్, విప్రో, హెచ్సీఎల్ టెక్, టాటా స్టీల్స్, జెట్ ఎయిర్ వేస్ తదితర సంస్థల షేర్లు నష్టపోయాయి. 

More Telugu News