amaravathi: ముగిసిన ఏపీ మంత్రి వర్గ సమావేశం

  • సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశం
  • సుమారు రెండు గంటల పాటు పలు అంశాలపై చర్చ
  • ‘ఉపాధి హామీ’ అధికారులను అభినందించిన సీఎం
అమరావతిలో ఈరోజు మధ్యాహ్నం నిర్వహించిన ఏపీ మంత్రి వర్గ సమావేశం ముగిసింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో కరవు, ‘ఫణి’ తుపాన్, తాగునీటి ఎద్దడి, వాతావరణ పరిస్థితులు, ఉపాధి హామీ పనులపై  చర్చించారు. సుమారు రెండు గంటల పాటు పలు అంశాలపై మంత్రి వర్గం చర్చించింది. ఉపాధి హామీ పథకం అమలులో ఏపీ ఉత్తమ రాష్ట్రంగా నిలవడంపై సంబంధిత అధికారులను చంద్రబాబు అభినందించినట్టు సమాచారం. ఉపాధి హామీకి సంబంధించిన ఐదు విభాగాల్లో మొదటి స్థానంలో, ఆరు విభాగాల్లో 2వ స్థానంలో ఏపీ నిలిచింది.
amaravathi
ap cabinet
cm
chandrababu

More Telugu News