kovelamudi bapayya: కృష్ణ .. శోభన్ బాబు దూసుకొస్తుండటంతో ఎన్టీఆర్ ఆలోచనలో పడ్డారు: దర్శకుడు కె. బాపయ్య

  • ఎన్టీఆర్ ను డిఫరెంట్ లుక్ తో చూపించాను
  •  రొమాంటిక్ సాంగ్స్ లో స్టెప్పులు వేయించాను 
  •  ఫ్లాప్ అవుతుందని అంతా అన్నారు  

 ఎన్టీ రామారావు .. అక్కినేని నాగేశ్వరరావు .. కృష్ణ .. శోభన్ బాబు .. కృష్ణంరాజు వంటి ఆనాటి అగ్రస్థాయి కథానాయకులందరితోను కె. బాపయ్య వరుస సినిమాలు చేస్తూ వెళ్లారు. కుటుంబ కథా చిత్రాలతో అనేక విజయాలను సొంతం చేసుకున్న ఆయన, తాజా ఇంటర్వ్యూలో ఒక ఆసక్తికరమైన విషయం చెప్పుకొచ్చారు.

"తెలుగు తెరపై యువ కథానాయకులుగా కృష్ణ .. శోభన్ బాబు దూసుకొస్తున్నారు. దాంతో ఇక తనపని అయిపోయిందని ఎన్టీ రామారావుగారు అనుకున్నారు. అందువల్లనే ఆయన 'తాతమ్మ కల' .. 'బడిపంతులు' వంటి సినిమాల్లో వయసైపోయిన పాత్రలను చేశారు. అలాంటి పరిస్థితుల్లో ఆయనతో 'ఎదురులేని మనిషి' సినిమా చేశాను. ఎన్టీఆర్ ను యంగ్ లుక్ తో చూపిస్తూ .. రొమాంటిక్ సాంగ్స్ ఉండేలా ఆ సినిమా చేశాను. ఈ సినిమా పరాజయంపాలు కావడం ఖాయమని ఇండస్ట్రీలో చాలామంది చెప్పుకున్నారు. విడుదలకి ముందురోజు రాత్రి .. నిర్మాత అశ్వనీదత్ నిద్రపోలేదు. అలా విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని సాధించింది. మరో పదేళ్ల వరకూ వయసు మళ్లిన పాత్రలను చేయనని ఈ సినిమా 100 రోజుల వేడుకలో ఎన్టీఆర్ చెప్పారు" అని అన్నారు. 

  • Loading...

More Telugu News