Vijayawada: విజయవాడ కనకదుర్గ ఆలయంలో భద్రతా లోపాలు!

  • భద్రతా సిబ్బందిని పెంచాలని ఈవోకు పోలీసుల సూచన
  • మెటల్ డిటెక్టర్, లగేజ్ స్కానర్స్ ఏర్పాటుకు సూచన
  • భద్రతా చర్యలను నెలలోగా చేపడతామన్న ఈవో
విజయవాడ కనకదుర్గ ఆలయంలో భద్రతా లోపాలు ఉన్నట్లు పోలీసు అధికారులు గుర్తించారు. దీంతో భద్రతా సిబ్బందిని పెంచాలని ఆలయ ఈవోకు సూచించారు. ఆలయ ప్రవేశ మార్గంలో డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్ ఏర్పాటు చేయాలని, భక్తుల ప్రవేశ మార్గాలు, బయటకు వెళ్లే మార్గాల వద్ద సెక్యూరిటీ ఉంచాలని, లగేజ్ బ్యాగ్ స్కానర్స్ ను ఏర్పాటు చేయాలని పోలీసులు సూచించినట్టు సమాచారం. ఈ సందర్భంగా ఆలయ ఈవో కోటేశ్వరమ్మ స్పందిస్తూ, భద్రతా చర్యలను నెలలోగా చేపడతామని చెప్పారు.
Vijayawada
kanaka durga
temple
security

More Telugu News