shavukaru janaki: 'దేవదాసు' నుంచి నన్ను హఠాత్తుగా తీసేయడంతో పది రోజుల పాటు అన్నం తినలేదు: 'షావుకారు' జానకి

  • 'దేవదాసు' కోసం నన్ను తీసుకున్నారు 
  • ఒక పాట రిహార్సల్స్ కూడా చేయించారు 
  • నాకు నేను ధైర్యం చెప్పుకున్నాను

తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో 'షావుకారు' జానకి మాట్లాడుతూ, 'దేవదాసు' సినిమా సమయంలో జరిగిన ఒక సంఘటనను గురించి ప్రస్తావించారు. "అక్కినేని నాగేశ్వరరావుగారి 'దేవదాసు'లో కథానాయికగా ముందుగా నన్ను తీసుకున్నారు. నిర్మాత డీఎల్ గారు .. దర్శకులు వేదాంతం రాఘవయ్య గారు మా ఇంటికి వచ్చి, 'దేవదాసు'లో పారూ పాత్రకి నేను సరిగ్గా సరిపోతానని చెప్పి ఒప్పించారు .. అగ్రిమెంట్ చేయించారు.

'ఓ దేవాదా .. 'అనే పాట రిహార్సల్స్ కూడా చేయించారు. మరుసటి రోజు ఉదయం షూటింగ్ అనగా .. 'ఈ సినిమాలో మీరు లేరు' అని ఒక చీటీ మీద రాసి నిర్మాత డీఎల్ గారు నాకు పంపించారు. వాళ్లంతట వాళ్లు వచ్చి నన్ను ఎంపిక చేసుకుని, హఠాత్తుగా తీసేయడంతో నేను షాక్ అయ్యాను. కారణం చెప్పుంటే నేను అంతగా బాధపడేదానిని కాదు. వాళ్లు ఆ విధంగా చేయడం వలన నేను పది రోజులు భోజనం చేయలేదు. ఆ తరువాత మనసు దిటవు చేసుకుని, నాకు నేను ధైర్యం చెప్పుకుని తేరుకున్నాను" అని చెప్పుకొచ్చారు. 

  • Loading...

More Telugu News