USA: అమెరికాలో తెలుగు వ్యక్తి దుర్మరణం.. హైదరాబాద్ వాసిగా గుర్తింపు!

  • న్యూయార్క్ లో జరిగిన రోడ్డు ప్రమాదం
  • హైదరాబాద్ లోని నల్లకుంట వాసిగా గుర్తింపు
  • మృతుడి కుటుంబసభ్యులకు అందిన సమాచారం
అమెరికాలో తెలుగు వ్యక్తి  దుర్మరణం చెందాడు. న్యూయార్క్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో కారు ఢీ కొని సాయినాథ్ అనే వ్యక్తి మృతి చెందాడు. కొన్ని రోజుల క్రితమే ఇతను ఉద్యోగం నిమిత్తం అక్కడికి వెళ్లినట్టు సమాచారం. మృతుడు హైదరాబాద్ లోని నల్లకుంట నివాసిగా అక్కడి పోలీసులు గుర్తించారు. ఈ మేరకు అతని కుటుంబ సభ్యులకు ఎంబసీ అధికారులు సమాచారం తెలియజేశారు. ఈ సంఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
USA
New york
Hyderabad
Road Accident

More Telugu News