shavukaru janaki: నా చెల్లెలు కృష్ణకుమారి మరణాన్ని నేను ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నాను: 'షావుకారు' జానకి

  • నా తరువాతే కృష్ణకుమారి సినిమాల్లోకి వచ్చింది 
  • నిజంగా మా చెల్లెలు చాలా అందగత్తె 
  • తను లేకుండా బతకడం కష్టంగా వుంది  
'షావుకారు' జానకి .. కృష్ణకుమారి ఇద్దరూ అక్కా చెల్లెళ్లు అనే విషయం తెలిసిందే. కథానాయికలుగా ఇద్దరూ తెలుగు తెరపై ఒక వెలుగు వెలిగారు. 2018 జనవరి 24వ తేదీన కృష్ణకుమారి మరణించారు. తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో 'షావుకారు' జానకి మాట్లాడుతూ, తన చెల్లెలిని తలచుకున్నారు."నాకు .. కృష్ణకుమారికి ఏడాది మీద నాలుగు నెలల వయసు తేడా. అలాగే నేను సినిమాల్లోకి వచ్చిన ఏడాదిన్నరకి తాను సినిమాల్లోకి వచ్చింది. నిజంగానే తను చాలా అందగత్తె. 20 ఏళ్ల నుంచి  నేను తన ఎస్టేట్ లోనే ఉంటున్నాను. ఇద్దరం కలిసి సరదాగా కబుర్లు చెప్పుకుంటూ వాకింగ్ చేసేవాళ్లం .. పోటీలుపడి వంటలు చేసేవాళ్లం. కృష్ణకుమారి ఎస్టేట్ పూల మొక్కలతో .. పండ్ల చెట్లతో ఎంతో అందంగా ఉంటుంది. నా చెల్లెలు నా పక్కన లేకుండా అవన్నీ చూస్తుంటే నాకు కలిగే బాధ అంతా ఇంతా కాదు. ఆ ఎస్టేట్ అంతా చూస్తూ 'కృష్ణా వెళ్లిపోయావా' అనుకుని కన్నీళ్లు పెట్టుకుంటూ వుంటాను" అని చెప్పుకొచ్చారు.
shavukaru janaki
krishnakumari

More Telugu News