సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- రాజమౌళి సినిమాలో అనుష్క లేదట
- బడ్జెట్ తగ్గించిన బోయపాటి
- మహేశ్ కొత్త సినిమా అప్ డేట్
* బాలకృష్ణ, బోయపాటి కలయికలో మరో భారీ చిత్రానికి సన్నాహాలు జరుగుతున్నాయి. మొదట్లో ఈ చిత్రానికి దర్శకుడు 60 కోట్ల బడ్జెట్ ఇచ్చాడని, అయితే బాలయ్య మాత్రం 40 కోట్ల బడ్జెట్ లోనే సినిమా చేయాలని సూచించడంతో ఆ కథను పక్కన పెట్టేసి, మరో కథను సిద్ధం చేసినట్టు చెబుతున్నారు. ఈ కథ బాలయ్యకి నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట.
* 'మహర్షి' సినిమాతో ప్రేక్షకులను అలరిస్తున్న హీరో మహేశ్ బాబు త్వరలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నాడు. ఇందులో ఆయన పోలీసాఫీసర్ పాత్ర పోషించనున్నట్టుగా గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే, ఇందులో వాస్తవం లేదని, మహేశ్ పోలీసాఫీసర్ గా నటించడం లేదని తాజా సమాచారం.