Andhra Pradesh: రేపు ఏపీ కేబినెట్ భేటీకి సీఈసీ అనుమతి

  • కేబినెట్ భేటీ జరుగుతుందో లేదో అన్న సస్పెన్స్ కు తెర
  • కరవు, ‘ఫణి’, తాగునీరు, ఉపాధి హామీపై రేపు సమీక్ష
  • రేపు ఉదయం ఆయా అధికారులతో సీఎం భేటీ  
ఏపీ కేబినెట్ సమావేశం రేపు జరుగుతుందా లేదా అనే అంశంపై సస్పెన్స్ కు తెరపడింది. రేపు కేబినెట్ సమావేశం నిర్వహించేందుకు సీఈసీ నుంచి అనుమతి లభించింది. రేపటి కేబినెట్ సమావేశంలో కరవు పరిస్థితులు, ‘ఫణి’ తుపాన్, తాగునీరు, ఉపాధి హామీ అంశాలపై సమీక్ష నిర్వహించనుంది.

కాగా, రేపు ఉదయం నాలుగు ముఖ్య శాఖల అధికారులతో సీఎం చంద్రబాబునాయుడు సమావేశం కానున్నారు. రేపు ఉదయం 10.30 గంటలకు మంత్రి వర్గ సమావేశం నిర్వహించాలని తొలుత నిర్ణయించారని, అయితే, జిల్లాల్లో ఉన్న మంత్రులు అమరావతికి చేరుకోవాల్సి ఉన్నందున సమావేశం నిర్వహించే సమయాన్ని మార్పు చేసినట్టు తెలుస్తోంది. రేపు మధ్యాహ్నం మూడు గంటలకు కేబినెట్ మీటింగ్ నిర్వహిస్తారని సమాచారం.
Andhra Pradesh
cabinet
CEC
amaravathi
cm

More Telugu News