Andhra Pradesh: ఏపీ కేబినెట్ సమావేశం నిర్వహణపై వీడని సస్పెన్స్!

  • సీఈసీ నుంచి ఇంకా లభించని అనుమతి
  • సీఈసీతో ఫోన్లో మాట్లాడిన ఇంఛార్జీ సీఈఓ సుజాత శర్మ
  • కాసేపట్లో సమాచారం వస్తుందన్న అధికారిణి
ఏపీ కేబినెట్ సమావేశం నిర్వహణపై సస్పెన్స్ ఇంకా వీడలేదు. రేపు ఉదయం కేబినెట్ సమావేశం నిర్వహించాలని అనుకున్నారు. కానీ, కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఇంకా ఎటువంటి అనుమతి ఏపీ ప్రభుత్వానికి లభించలేదు. ఈ నేపథ్యంలో సీఈసీ అధికారులతో ఇంఛార్జీ సీఈఓ సుజాత శర్మ ఫోన్ లో మాట్లాడారు. సీఈసీ అధికారుల సమాచారం కోసం ఎదురుచూస్తున్నామని, కాసేపట్లో ఈసీ నుంచి తమకు సమాచారం వస్తుందని భావిస్తున్నట్టు చెప్పారు.
Andhra Pradesh
cabinet
CEC
sujata sharma

More Telugu News