Manda Krishna: ఆ కోణంలో ఆలోచించే హరీశ్ రావును పక్కకు తప్పించారు: మంద కృష్ణ మాదిగ

  • కేటీఆర్ తండ్రిచాటు బిడ్డ
  • సొంతంగా చట్టాన్ని, రాజ్యాంగాన్ని గౌరవిస్తాడని భావించలేం
  • కేటీఆర్ కు ఆ జ్ఞానమే ఉంటే అంబేద్కర్ చిత్రపటాన్ని యథాస్థానంలో పెట్టాలి

ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కేసీఆర్ రాజకీయ వారసత్వంపై స్పందించారు. కేటీఆర్ తండ్రి చాటు కొడుకేనని, తండ్రి కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తప్పక అనుసరిస్తాడని పేర్కొన్నారు. కేసీఆర్ మాట కేటీఆర్ వినాల్సిందే తప్ప, ఆయన సొంతంగా చట్టాన్ని, రాజ్యాంగాన్ని గౌరవిస్తాడని భావించలేమని స్పష్టం చేశారు.

కేసీఆర్ ఢిల్లీ వెళ్లి దేశ రాజకీయాల్లో ముఖ్యపాత్ర పోషించే సమయానికి కేటీఆర్ నే తెలంగాణ ముఖ్యమంత్రిగా చేస్తారన్నది అందరికీ తెలిసిన విషయమేనని మంద కృష్ణ అన్నారు. కొడుకును ముఖ్యమంత్రిగా చేయడం కోసమే సొంత మేనల్లుడు హరీశ్ రావును సైతం పక్కకు తప్పించారని అన్నారు.

టీఆర్ఎస్ కార్యాలయమైన తెలంగాణా భవన్ లో అంబేద్కర్ ఫొటో స్థానంలో కేసీఆర్ ఫొటో దర్శనం ఇవ్వడంపై మంద కృష్ణ స్పందిస్తూ.. కేటీఆర్ నిజంగా ఉన్నత చదువులు చదివిన వాడే అయితే, ఆ చదువుల ద్వారా వచ్చిన జ్ఞానమే ఉంటే తెలంగాణ భవన్ లో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ చిత్రపటాన్ని యథాస్థానంలో పెడతారని, ఒకవేళ ఆయన ఆ పనిచేస్తే కేసీఆర్ కు, కేటీఆర్ కు ఎంతో తేడా ఉందని అంగీకరిస్తానని మంద కృష్ణ పేర్కొన్నారు. 

  • Loading...

More Telugu News