tammareddy: స్టార్ హీరోలపై నా కోపానికి అర్థం వుంది: దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ

  • హీరోలు ఎంతసేపూ కథ చెప్పమంటారు 
  • కొన్ని కథలు చెప్పడానికి ఏమీ వుండదు
  •  దర్శకులను నమ్మితే మంచి సినిమాలు వస్తాయి

తెలుగు చిత్రపరిశ్రమలో దర్శకనిర్మాతగా తమ్మారెడ్డి భరద్వాజకి ఎంతో అనుభవం వుంది. చిత్రపరిశ్రమలో అనేక విషయాలపై ఆయన ఎప్పటికప్పుడు స్పందిస్తూ వుంటారు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ .. "మన స్టార్ హీరోలపై నాకేదో కోపం ఉందని కొంతమంది చెప్పుకోవడం నేను విన్నాను. నిజానికి స్టార్ హీరోలంతా నాతో ఎంతో సన్నిహితంగా వుంటారు. వాళ్లపై నాకు ఎలాంటి కోపం లేదు .. నా బాధంతా వాళ్లు దర్శకుడిపై పూర్తి నమ్మకం ఉంచడం లేదనే.

ఎంతసేపూ కథ మాకు చెప్పండి, మేము ఏదో చేస్తాం అంటారు .. నిజానికి 'బాహుబలి' కథ చెబితే ఎవరూ చేయవలసిన సినిమా కాదు అది. కానీ అక్కడ దర్శకుడిని నిర్మాత .. హీరో హీరోయిన్లు పూర్తిగా నమ్మారు. అందువల్లనే అంతగొప్ప సినిమా వచ్చింది. అలా దర్శకుడిపై నమ్మకం ఉంచిన రోజున అన్ని సినిమాలు బాగానే ఆడతాయి. అలా నమ్మకం పోవడం వలన హీరోలపై కోపం వుంటుందే తప్ప వ్యక్తిగతంగా ఏమీ ఉండదు" అని చెప్పుకొచ్చారు.

More Telugu News