shiva shankar: ఆ క్షణంలోనే నా డైరీలోని పేజీలన్నీ చింపేశాను!: శివశంకర్ మాస్టర్

  • ఎన్నో సినిమాలకి పనిచేశాను 
  • ఆ వివరాలు డైరీలో రాసుకునేవాడిని
  • డైరీ చింపేయడానికి అదే కారణం  

వివిధ భాషల్లోని అనేక చిత్రాలకు శివ శంకర్ మాస్టర్ నృత్య దర్శకుడిగా పనిచేశారు. ఆయన కొరియోగ్రఫీని అందించిన చాలా పాటలు ప్రేక్షకుల మనసులను దోచుకున్నాయి. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, "నృత్య దర్శకుడిగా నా కెరియర్ ను ఆరంభించిన దగ్గర నుంచి నేను డైరీ రాసుకునేవాడిని. ఎన్ని సినిమాలకి పనిచేశాను .. ఎన్ని పాటలకు కొరియోగ్రఫీని అందించాను అనేది రాసుకునేవాడిని.

ఒక రోజున ఆ డైరీని పరిశీలనగా చూసుకుని .. ఇన్ని సినిమాలకి పని చేశానా? అనుకున్నాను. అంతే, అదే క్షణంలో ఆ డైరీలోని పేజీలను చింపేశాను. ఇక ఇప్పుడు నాకు ఎవరెవరితో ఎన్ని సినిమాలు చేశానో .. ఏయే పాటలకి డాన్స్ కంపోజ్ చేశానో గుర్తు లేదు. నేను ఇన్ని సినిమాలు చేశానా? అనే ఆలోచన వస్తే అక్కడే ఆగిపోతాను .. ముందుకు వెళ్లలేను. అందుకే డైరీ చింపేశాను .. ఇప్పుడు కొత్తగా వచ్చే ప్రతి అవకాశాన్ని మరింత ఉత్సాహంతో అందుకుంటున్నాను" అని చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News