kota shankar rao: అన్నయ్య పేరు చెప్పుకుని అవకాశాలు అడిగే అవసరం రాలేదు: కోట శంకర్రావు

  • రంగస్థలంపై అనుభవం వుంది 
  • ఉద్యోగానికి ప్రాధాన్యతనిచ్చాను 
  • వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్నాను 
కోట శ్రీనివాసరావుకి .. ఆయన సోదరుడైన కోట శంకర్రావుకు రంగస్థలంపై మంచి అనుభవం వుంది. కోట శ్రీనివాసరావు సినిమాల్లో మంచి నటుడిగా రాణిస్తే, కోట శంకర్రావు అడపా దడపా సినిమాలు చేస్తూ, ఎక్కువగా సీరియల్స్ చేస్తూ వెళ్లారు.

 తాజా ఇంటర్వ్యూ లో ఆయన మాట్లాడుతూ, "నేను బ్యాంకులో ఉద్యోగం చేస్తుండటం వలన రిస్క్ తీసుకోలేదు. ఉద్యోగానికి ఎలాంటి ఇబ్బంది రాకూడదనే ఉద్దేశంతో, దానిని కాపాడుకుంటూనే వచ్చిన అవకాశాలను చేసుకుంటూ వెళ్లాను. ఆరంభంలో నేను చేసిన సినిమాలు కూడా నాకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. కోట శంకర్రావు ఏ తరహా పాత్రలను బాగా చేస్తాడు అనే విషయం కూడా అందరికీ తెలిసిపోయింది. కెరియర్ ఆరంభంలోనే నాకంటూ గుర్తింపు తెచ్చుకోవడం వలన, మా అన్నయ్య పేరు చెప్పుకుని వేషాలు అడిగే అవసరం రాలేదు" అని చెప్పుకొచ్చారు. 
kota shankar rao

More Telugu News