Andhra Pradesh: చంద్రబాబు లేకుండా బీజేపీ వ్యతిరేక కూటమి ఎలా సాధ్యం?: కేసీఆర్ కు డొక్కా మాణిక్య వరప్రసాద్ ప్రశ్న

  • మోదీ అన్ని వ్యవస్థలను నాశనం చేశారు
  • అయన్ను ఎదుర్కోవడం చంద్రబాబు వల్లే సాధ్యం
  • అమరావతిలో మీడియాతో టీడీపీ నేత
ప్రధాని నరేంద్ర మోదీ దేశంలోని అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించారని టీడీపీ నేత, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ విమర్శించారు. ఆయన వ్యవస్థలను నాశనం చేస్తే, చంద్రబాబు అన్ని వ్యవస్థలను బాగు చేస్తున్నారని కితాబిచ్చారు. ప్రధాని మోదీని ఎదుర్కొనే సత్తా చంద్రబాబుకే ఉందని ఆయన స్పష్టం చేశారు. అమరావతిలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో డొక్కా మాట్లాడారు.

ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై డొక్కా మాణిక్య వరప్రసాద్ మండిపడ్డారు. టీడీపీ లేకుండా బీజేపీ వ్యతిరేక కూటమిని ఎలా ఏర్పాటు చేస్తారో కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ నేతలకు నిజంగా దమ్ముంటే మద్యపాన నిషేధంపై బీజేపీ తీర్మానం చేయాలని సవాల్ విసిరారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా టీడీపీ విజయాన్ని అడ్డుకోలేరని స్పష్టం చేశారు. చంద్రబాబు మరోసారి ఏపీ ముఖ్యమంత్రి కావడం ఖాయమని జోస్యం చెప్పారు.
Andhra Pradesh
KCR
Chandrababu
Telangana
dokka manikya varaprasad
amaravati

More Telugu News