Tirupati: తిరుపతి గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాల్లో అపశ్రుతి... భయపడ్డ భక్తులు!

  • స్వామివారికి సింహవాహన సేవ
  • కరెంటు వైర్లను తాకిన గొడుగులు
  • పరుగులు పెట్టిన భక్తులు
ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుపతిలో గోవిందరాజస్వామి వారికి జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో ఓ అపశ్రుతి చోటుచేసుకోగా, భక్తులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. స్వామివారికి సింహవాహన సేవ జరుగుతున్న వేళ, రథంపై అమర్చిన గొడుగులు కరెంట్ వైర్లకు తగిలి నిప్పురవ్వలు ఎగిసిపడి, గొడుగులు పక్కకు వాలాయి. దీంతో ఊరేగింపును తిలకిస్తున్న వేలాది మంది పరుగులు పెట్టారు. అధికారులు సరైన ఏర్పాట్లు   చేయని కారణంగానే ఈ ఘటన జరిగిందన్న విమర్శలు వస్తున్నాయి. ఊరేగింపు జరిగే మార్గంలో తక్కువ ఎత్తులో ఉన్న తీగలను తొలగించడంలో నిర్లక్ష్యం వహించిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.
Tirupati
Govindarajaswamy
Brahmotsavams

More Telugu News