ulli porka: ఆకాశాన్నంటిన ఉల్లి పొరక ధర.. కిలో రూ.100కు చేరిక!

  • సాధారణ ఉల్లి ధర రూ.16 మాత్రమే
  • హడలి పోతున్న కొనుగోలుదారులు
  • డిమాండ్‌కు తగ్గ సరఫరా లేకే అంటున్న వ్యాపారులు

ఎన్నో ఔషధ గుణాల సమ్మిళితమైన ఉల్లి పొరక ధర హైదరాబాద్‌ మార్కెట్లో ఆకాశాన్నంటి, ఏకంగా కిలో రూ.100లు పలుకుతోంది. మరోవైపు సాధారణ ఉల్లిపాయల ధర కిలో రూ.16లు ఉండడం గమనార్హం. ఉల్లి పొరకలో క్యాన్సర్‌ కణాలను అడ్డుకునే ఔషధ గుణాలు ఉన్నాయి. అలాగే బీపీ (రక్తపోటు)‌ను సాధారణ స్థితిలో ఉంచి గుండెపోటు వంటి సమస్యలను దూరం చేస్తుంది.

ఇంకా శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంపుచేసి ఇన్‌ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడుతుంది. జీర్ణక్రియను క్రమబద్ధీకరించి ఆహారం తేలికగా జీర్ణమయ్యేందుకు సహాయ పడుతుంది. కొలెస్ట్రాల్‌ను నియంత్రణలో ఉంచుతుందని, ఎముకల దృఢత్వాన్ని కాపాడుతుందని వైద్యులు చెబుతారు. గర్భిణులు ఉల్లి పొరక తింటే పోలిక్‌ యాసిడ్ ఉత్పాదనలో సహాయ పడి కణాల పునరుత్పాదనకు దోహదపడుతుంది.

ఇన్ని ఔషధ గుణాలు ఉండడం వల్లే మార్కెట్లో ఉల్లి పొరకకు అంత డిమాండ్‌. కానీ ప్రస్తుతం హైదరాబాద్‌ మార్కెట్లో డిమాండ్‌కు తగ్గ సరఫరా లేకపోవడంతో ఆదివారం కేజీ రూ.100కు చేరింది. దీంతో కొనుగోలుదారులతోపాటు రైతు బజార్‌ అధికారులు అవాక్కయ్యారు. పక్షం రోజుల నుంచి ఉల్లి పొరక ధర పెరుగుతోందని వ్యాపారులు చెబుతున్నారు. పదిహేను రోజుల క్రితం రూ.60 ఉన్న ధర శనివారం రూ.90కు చేరింది. ఒక్కరోజులోనే రూ.10 పెరిగి ఆదివారం వంద అయ్యింది. హైదరాబాద్‌లోని రైతు బజార్లకు దౌల్తాబాద్‌, వర్గల్‌, గజ్వేల్‌, తూఫ్రాన్‌ ప్రాంతాల నుంచి ఉల్లిపొరక దిగుమతి అవుతుంది.

  • Loading...

More Telugu News