Cricket: ఓటర్ల లిస్టులో క్రికెట్ దిగ్గజం పేరు గల్లంతు

  • బిషన్ సింగ్ బేడీకి పోలింగ్ బూత్ వద్ద చేదు అనుభవం
  • పోలింగ్ అధికారులు సెల్ఫీలు దిగడంపై మాజీ క్రికెటర్ మండిపాటు
  • ఇలా ఎప్పుడూ జరగలేదంటూ ఆవేదన
ఈసారి ఎన్నికల్లో అనేకమంది పేర్లు గల్లంతవడం తెలిసిందే. ఒకప్పుడు భారత క్రికెట్ జట్టుకు ఎనలేని సేవలు అందించిన స్పిన్ దిగ్గజం బిషన్ సింగ్ బేడీకి కూడా ఈ తరహా అనుభవం ఎదురైంది. ఎంతో ఉత్సాహంగా ఓటేసేందుకు ఢిల్లీలోని ఓ పోలింగ్ బూత్ కు వెళ్లిన బేడీకి అక్కడి ఓటర్ల లిస్టులో తన పేరు లేకపోవడంతో తీవ్ర నిరాశను మిగిల్చింది. పోలింగ్ అధికారులకు ఫిర్యాదు చేద్దామని వెళ్లిన ఆయనకు అంతకంటే దిగ్భ్రాంతికరమైన అనుభవం తప్పలేదు.

బిషన్ సింగ్ బేడీని పట్టించుకోకుండా సదరు అధికారులు, పోలీసులు సెల్ఫీలు దిగడంలో మునిగిపోయారు. దీనిపై బేడీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతటి బాధాకరమైన సంఘటన ఎప్పుడూ ఎదుర్కోలేదని వాపోయారు. భారత ప్రజాస్వామ్యం ఇలా ఉంది మరి అంటూ విచారం వ్యక్తం చేశారు.
Cricket
New Delhi
Bishan Singh Bedi

More Telugu News