Sri Lanka: అగ్రరాజ్యాలు ఆయుధాల తయారీ నిలిపివేస్తే ఈ ప్రపంచంలో ఉగ్రవాదమే ఉండదు: శ్రీలంక అధ్యక్షుడు సిరిసేన

  • ఏ ఉగ్రసంస్థ ఆయుధాలను తయారుచేయడం లేదు
  • దేశాలు తయారుచేసిన ఆయుధాలనే ఉగ్రవాదులు ఉపయోగిస్తున్నారు
  • శాంతి గురించి మాట్లాడుతున్న దేశాల టెక్నాలజీనే మానవ వినాశనానికి తోడ్పడుతోంది

ఇటీవలే ఈస్టర్ పండుగ సందర్భంగా ఉగ్రదాడులకు గురైన శ్రీలంక ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఈ నేపథ్యంలో శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శక్తిమంతమైన దేశాలు ఆయుధాలను తయారుచేయడం నిలిపివేస్తే ఈ ప్రపంచంలో ఉగ్రవాదానికి చోటే ఉండదని అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ప్రపంచంలోని ఏ ఉగ్రవాద సంస్థ కూడా ఆయుధాలను తయారుచేయడం లేదని, పలు దేశాలు తయారు చేస్తున్న ఆయుధాలనే ఆ ఉగ్రవాద సంస్థలు ఉపయోగిస్తున్నాయని అన్నారు.

ప్రపంచంలో ఇవాళ సాంకేతికంగా ముందంజలో ఉన్న దేశాలే శాంతి గురించి, మానవ హక్కుల గురించి మాట్లాడుతున్నాయని, కానీ అదే సమయంలో ఆ దేశాల సాంకేతిక పరిజ్ఞానమే మానవాళి వినాశనానికి కారణమవుతోందని వ్యాఖ్యానించారు.

More Telugu News