Maharshi: వంశీ.. నేను కూడా కాలర్ ఎత్తా: ‘మహర్షి’ సక్సెస్ మీట్ లో మహేశ్

  • ప్రీ రిలీజ్ వేడుకలో దర్శకుడి వ్యాఖ్యల గురించి ప్రస్తావన
  • ‘మహర్షి’ విజయంపై మహేశ్ సంతోషం
  • నా కెరీర్ లో విజయవంతమైన చిత్రాలను ‘మహర్షి’ అధిగమించబోతోంది
‘మహర్షి’ సినిమా సక్సెస్ మీట్ హైదరాబాద్ లోని నోవాటెల్ హోటల్ లో ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా మహేశ్ బాబు మాట్లాడుతూ, ఈ చిత్రం ప్రీరిలీజ్ వేడుకలో తన తండ్రి అభిమానులు, తన అభిమానులు కాలర్ ఎత్తుకుని తిరిగే చిత్రం ఇది అవుతుందని దర్శకుడు వంశీ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. తమ అభిమానులే కాదు, ‘ఈరోజున నేను కూడా కాలర్ ఎత్తాను.. వంశీ’ అంటూ ఈ చిత్రం విజయం సాధించడంపై మహేశ్ తన సంతోషం వ్యక్తం చేశారు. తన కెరీర్ లో ఎంతో విజయవంతమైన చిత్రాలను ఈ చిత్రం అధిగమించబోతోందని అన్నారు.

నిర్మాత అశ్వనీదత్ తనను ‘ప్రిన్స్ బాబు’ అని పిలుస్తుంటారని, ఆయనకు విపరీతంగా తాను నచ్చినప్పుడు మాత్రం ‘మహేశ్’ అని పిలుస్తారని, ‘మహర్షి’ సినిమా చూసిన తర్వాత ఆయన తనను అలా పిలిచారని మహేశ్ బాబు గుర్తుచేసుకున్నారు. 
Maharshi
movie
success meet
mahesh babu

More Telugu News