vizag: విశాఖ ఏజెన్సీలో హై అలర్ట్!

  • నిన్న ఏవోబీలో మందుపాతర పేల్చిన మావోయిస్టులు
  • ఏవోబీలో మావోయిస్టు అగ్రనేతల మకాం
  • కూంబింగ్ ముమ్మరం చేసిన పోలీసులు
మావోయిస్టులు నిన్న ఏవోబీ (ఆంధ్రా-ఒరిస్సా సరిహద్దు)లో మందుపాతర పేల్చిన ఘటన నేపథ్యంలో విశాఖ ఏజెన్సీలో హై అలర్ట్ ప్రకటించారు. మావోయిస్టుల కోసం పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. ఏవోబీలో మావోయిస్టు అగ్రనేతలు చలపతి, అరుణ, నవీన్ మకాం వేసినట్టు పోలీసులకు సమాచారం ఉంది. దీంతో, కూంబింగ్ ముమ్మరం చేశారు. వరుస ఎన్ కౌంటర్లు, మావోయిస్టుల ప్రతీకార దాడులతో ఏవోబీ ప్రాంత వాసులు బిక్కుబిక్కు మంటూ కాలం గడుపుతున్నారు. 
vizag
Agency
high alert
maoist
AOB

More Telugu News