Kurnool District: వెల్దుర్తి ప్రమాదం.. ఎమ్మెల్యే అబ్రహంను నిలదీసిన బాధితుల బంధువులు

  • ఈ ఘటనపై సీఎంతో చర్చించా
  • బాధిత కుటుంబాలకు అండగా ఉంటా
  • న్యాయం జరగకుంటే బాధితుల పక్షాన పోరాడతా
కర్నూలు జిల్లా వెల్దుర్తిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 16 మంది దుర్మరణం పాలవగా, పలువురికి తీవ్ర గాయాలైన విషయం తెలిసిందే. మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలంటూ వారి తరపు బంధువులు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఈరోజు ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే అబ్రహంను వారు నిలదీశారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని, వారిని అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఈ ఘటనపై సీఎంతో చర్చించామని చెప్పారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున నష్టపరిహారం ప్రకటించలేమని, న్యాయం జరగకుంటే బాధితుల పక్షాన తానే పోరాటం చేస్తానని బాధిత కుటుంబాలకు హామీ ఇచ్చారు.  
Kurnool District
veldurthi
mla
abraham

More Telugu News