Andhra Pradesh: అనంతపురంలో మరణ మృదంగం మోగుతోంది.. ఇంకెన్నాళ్లు మోసం చేస్తారు?: విజయసాయిరెడ్డి

  • కరవుతో వేలాది కుటుంబాల వలసబాట
  • పశువులు, గొర్రెలకు మేత దొరకట్లేదు
  • ట్విట్టర్ లో స్పందించిన వైసీపీ నేత
తీవ్రమైన కరవు పరిస్థితులు నెలకొనడంతో అనంతపురంలో మరణ మృదంగం మోగుతోందని వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ఆరోపించారు. కరవు కారణంగా వేలాది కుటుంబాలు పక్క రాష్ట్రం కర్ణాటకకు వలస పోతున్నాయని వ్యాఖ్యానించారు.

చివరికి పశువులు, గొర్రెలకు మేత కూడా దొరక్కపోవడంతో వాటిని సైతం పొరుగు రాష్ట్రాలకు తరలిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఓవైపు ఇలాంటి పరిస్థితులు ఉంటే మరోవైపు రెయిన్ గన్లు, నీటి గలగలలు, కియా కార్ల ఫ్యాక్టరీతో ఇంటికో ఉద్యోగం అని ప్రజలను ఎన్నాళ్లు మోసం చేస్తారని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
Andhra Pradesh
Anantapur District
Vijay Sai Reddy
Twitter
Chandrababu

More Telugu News