Kurnool District: రామాపురంలో తీవ్ర విషాదం నింపిన వెల్దుర్తి దుర్ఘటన

  • గ్రామంలో పెను విషాదం
  • దుర్ఘటనలో 15 మంది మృతి
  • నిశ్చితార్థానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం
కర్నూలు జిల్లా వెల్దుర్తి సమీపంలో హైదరాబాద్ - బెంగుళూరు జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం గద్వాల జిల్లా రామాపురం గ్రామంలో పెను విషాదాన్ని నింపింది. ఈ దుర్ఘటనలో ఆ గ్రామానికి చెందిన 15 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఓ నిశ్చితార్థ వేడుకకు గుంతకల్ వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

17 నుంచి 20 మంది తుఫాన్ వాహనంలో బయలుదేరి వెళ్లినట్టు తెలుస్తోంది. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కాకపోయినా, ఒకే గ్రామానికి చెందిన వారై ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఘటన గురించి తెలుసుకున్న పలువురు గ్రామస్థులు హుటాహుటిన ఘటనా స్థలానికి బయలుదేరి వెళ్లారు.
Kurnool District
Veldurthi
National HIghway
Tufan
Ramapuram
Road Accident

More Telugu News