Puri Jagannadh: పూరి జగన్నాథ్ ఆలయాన్ని డ్యామేజ్ చేసిన ఫణి తుపాను: ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా

  • ఆలయంలో కొన్ని చోట్ల పెచ్చులు ఊడిపోయాయి
  • రథయాత్ర కంటే ముందే మరమ్మతులు పూర్తి చేస్తాం
  • కోణార్క్ దేవాలయం గార్డెన్ దారుణంగా దెబ్బతింది
ఒడిశాపై ఫణి తుపాను తీవ్ర ప్రభావాన్ని చూపిన సంగతి తెలిసిందే. పెను విపత్తును కలగజేసిన ఈ తుపాను... ప్రఖ్యాత పూరీ జగన్నాథ్ ఆలయంపై కూడా ప్రభావం చూపింది. తుపాను దెబ్బకు ఆలయం కొంత మేర దెబ్బతిన్నదని ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్ ఉషా శర్మ తెలిపారు

ఆలయంలో కొన్ని చోట్ల పెచ్చులు ఊడిపోయాయని ఉషా శర్మ వెల్లడించారు. పూరీ జగన్నాథుడి రథయాత్ర కంటే ముందే అవసరమైన అన్ని మరమ్మతులను పూర్తి చేస్తామని చెప్పారు. కోణార్క్ దేవాలయం గార్డెన్ కూడా ధ్వంసమయిందని తెలిపారు. దాదాపు 210 భారీ వృక్షాలు నేలకొరిగాయని చెప్పారు.
Puri Jagannadh
konark
temple
damage
fani cyclone

More Telugu News