vh: నడి రోడ్డుపై వీహెచ్ వీరంగం.. చలాన్లు వసూలు చేస్తున్న పోలీసులపై ఫైర్!

  • తెలుగుతల్లి ఫ్లై ఓవర్ వద్ద చలాన్లు రాస్తున్న పోలీసులు
  • కారు ఆపి పోలీసులపై మండిపడ్డ వీహెచ్
  • మండుటెండల్లో జనాలను పరేషాన్ చేస్తున్నారంటూ మండిపాటు
మండుటెండల్లో వాహనదారులను ఆపి చలాన్లు రాస్తున్న పోలీసులపై కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు మండిపడ్డారు. హైదరాబాదులోని తెలుగుతల్లి ఫ్లై ఓవర్ సమీపంలో ట్రాఫిక్ పోలీసులు వాహనదారులను ఆపి, చలాన్లు వేస్తున్న సందర్భంలో... అటువైపుగా వీహెచ్ వెళ్తున్నారు.

చలాన్ల వ్యవహారాన్ని గమనించిన ఆయన... కారు నుంచి దిగి, మొదట వాహనదారులతో మాట్లాడారు. ఆ తర్వాత పోలీసులపై ఫైర్ అయ్యారు. ఓ వైపు ఎండలు మండిపోతుంటే, జనాలను ఎందుకు పరేషాన్ చేస్తున్నారని ప్రశ్నించారు. వెంటనే అందరినీ పంపించేయాలని గదమాయించారు. అంతేకాదు, దగ్గరుండి వాహనదారులను పంపించేశారు.
vh
police
challan
congress

More Telugu News