mega star: నాకు ఎంతో ఇష్టమైన వారితో నా చిన్ననాటి ఫొటో ఇది: హీరో వరుణ్ తేజ్

  • ఈ ఫొటోను పాత ఆల్బమ్స్ నుంచి వెతికి మరీ తీశా 
  • నాకు ఎంతో ఇష్టమైన వీళ్లను ఎంతగానో ప్రేమిస్తుంటా 
  • వరుణ్ తేజ్ పోస్ట్ చేసిన అరుదైన ఫొటో

ప్రముఖ హీరో వరుణ్ తేజ్ తన చిన్నప్పటి ఓ అరుదైన ఫొటోను పోస్ట్ చేశాడు. ఈ ఫొటోను పాత ఆల్బమ్స్ నుంచి వెతికి మరీ తీశానని, తనకు ఎంతో ఇష్టమైన వీళ్లను ఎంతగానో ప్రేమిస్తుంటానని చెబుతూ ఓ ట్వీట్ చేశాడు. వరుణ్ తేజ్ పోస్ట్ చేసిన ఆ ఫొటోలో తన పెదనాన్న చిరంజీవి, తండ్రి నాగబాబు, బాబాయ్ పవన్ కల్యాణ్ లతో కలిసి ఉన్నాడు. తన బాబాయ్ పవన్ కల్యాణ్ భుజాలపై ఎక్కి కూర్చున్న చిన్నారి వరుణ్ తేజ్ కు అటూఇటూ చిరంజీవి, నాగబాబులు నిలబడి ఉండటం ఈ ఫొటోలో గమనించవచ్చు.

More Telugu News