indraneel: హైట్ ఎక్కువగా ఉన్నందుకు మొదటిసారిగా ఆ రోజు బాధపడ్డాను: ఇంద్రనీల్

  • 'లెజెండ్' కోసం పిలిపించారు
  • హైట్ కారణంగా ఛాన్స్ పోయింది
  •  ఆ రోజున చాలా బాధపడ్డాను  

బుల్లితెర నటుడిగా మంచి క్రేజ్ ను సంపాదించుకున్న ఇంద్రనీల్, తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఒక ఆసక్తికరమైన విషయం చెప్పుకొచ్చాడు. "బోయపాటి శ్రీనుగారు 'లెజెండ్' సినిమా చేస్తోన్న సమయంలో ఆయన టీమ్ నుంచి కాల్ వస్తే వెళ్లాను. బోయపాటి వంటి దర్శకుడి నుంచి పిలుపు వచ్చినందుకు నాకు చాలా ఆనందం కలిగింది. నాతో మాట్లాడిన తరువాత మళ్లీ కాల్ చేస్తానని బోయపాటి చెప్పారు.

దాంతో నేను వచ్చేసి నా సీరియల్ చేసుకుంటున్నాను. బోయపాటి గారి నుంచి కాల్ రాకపోవడంతో, విషయమేమిటో తెలుసుకోవాలనే ఉద్దేశంతో కో డైరెక్టర్ కి నేను కాల్ చేశాను. ఆ పాత్రకి మీరు సెట్ కారట .. బాగా హైట్ వున్నారని అంటున్నారు అని చెప్పాడు. ఇంత హైట్ ఎందుకున్నానా అని అప్పుడు మొదటిసారిగా బాధపడ్డాను. హైట్ కారణంగా నన్ను పక్కన పెట్టేయడమనేది నాకు బాధ కలిగించింది" అని అన్నాడు. 

  • Loading...

More Telugu News