yadadri temple: యాదాద్రి నరసింహస్వామి ప్రసాదంగా బెల్లం లడ్డు

  • ప్రయోగాత్మకంగా అమలు చేయాలని అధికారుల నిర్ణయం
  • ఇందుకోసం 11 మందితో కమిటీ ఏర్పాటు
  • లడ్డూ తయారు చేసి పదార్థాల వివరాలు అందించిన కమిటీ

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అభివృద్ధి చేసిన యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయం ప్రసాదం విషయంలోనూ ప్రత్యేకత చాటాలని దేవస్థానం వర్గాలు భావిస్తున్నాయి. స్వామి వారిని సందర్శించే భక్తులకు బెల్లం లడ్డూలు అందిస్తే ఎలా ఉంటుందన్న దానిపై కసరత్తు చేస్తున్నారు. బెల్లం లడ్డూ తయారీ ప్రక్రియపై కసరత్తు మొదలు పెట్టారు.

ఇందుకోసం ఆలయ ఈఓ ఐదుగురు ఏఈఓలు, ఇద్దరు ప్రధాన పూజారులు, ఇద్దరు వంట స్వాములు, ఇద్దరు పర్యవేక్షకులు కలిపి మొత్తం 11 మంది ఉద్యోగులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ గురువారం ప్రయోగాత్మకంగా బెల్లం లడ్డూ తయారు చేపట్టింది. వంద గ్రాముల బరువున్న లడ్డూ తయారీకి వాడిన వివరాలతో కూడిన నివేదికను ఆలయ ఈవోకు అందజేసింది. ఈ నివేదికను ఈఓ దేవాదాయ శాఖ కమిషనర్‌కు అందజేస్తారు. అటు నుంచి వచ్చే అనుమతుల మేరకు లడ్డూ తయారీపై నిర్ణయం తీసుకోనున్నారు.

More Telugu News