తెలంగాణలో ప్రారంభమైన రెండో విడత పరిషత్ ఎన్నికల పోలింగ్
- 31 జిల్లాల్లో ప్రారంభమైన రెండో విడత ఎన్నికల పోలింగ్
- మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో 4 గంటల వరకే పోలింగ్
- రెండో విడతలో ఒక జడ్పీటీసీ, 63 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం
మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించిన 218 స్థానాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగియనుండగా, మిగతా ప్రాంతాల్లో ఐదు గంటలకు ముగుస్తుంది. ఈ నెల 6న ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు మొదటి దశ పోలింగ్ పూర్తయింది. పోలింగ్ సందర్భంగా పోలీసులు గట్టి బందోబస్సు ఏర్పాటు చేశారు.